తిరువూరు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తిరువూరు పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఐలు వై.వి. శాతకర్ణి, టి. గౌరేశ్వరి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి మార్గాలను అనుసరిస్తూ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించి దేశానికి విశేష సేవలందించారని తెలిపారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.