అత్తిరాలలో ఘనంగా గిరి ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
రాజంపేట మండలం అత్తిరాలలోని శ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదర్శన అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం గంగా హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు.
గిరి ప్రదర్శనలో పాల్గొనేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తులు గిరి ప్రదర్శనలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అత్తిరాల పుణ్యక్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చమర్తి జగన్మోహన్ రాజు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.