ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ ముందస్తు వేడుకలు
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలను విద్యార్థులు ఆనందోత్సాహాలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పాఠశాలలో నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలపై అవగాహన పెంపొందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్. వెంకన్న, పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్ధన్, ఉపాధ్యాయులు బి. యాదయ్య, పి. శిరీష, ఆర్. పుష్పలత, రాజేశ్వరి, భవానీ, విద్యార్థులు పాల్గొన్నారు.