BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 11 October 2026, 10:21 pm
Posted by : CHERUKU RAMESH

తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ

తెలంగాణ
/ నల్గొండ / శాలిగౌరారం
Reporter
CHERUKU RAMESH శాలిగౌరారం మండల ఇన్వెస్టిగేషన్ ప్రతినిధి
11 Oct, 2026 - 10:21 PM
7 వీక్షణలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి ముందడుగు

శాలిగౌరారం: మండలంలోని తక్కళ్లపహాడ్ గ్రామం వద్దింపాముల ప్రాంతంలో మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ సర్పంచ్ కట్టంగూరు సురేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింత ధనంజయ్ ఆధ్వర్యంలో మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు.

వద్దింపాముల ప్రాంత ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి, వారికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మినీ వాటర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించనుంది.

ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తిరుపారి మల్లయ్య, ఉపసర్పంచ్ భీమనపల్లి చంద్రు, పులిగిల్ల పుష్పలత, నిమ్మనగోటి ధనలక్ష్మి, చెరుకు స్వరూప, భీమనపల్లి బిక్షం, జాల వర్ష, రోండి చంద్రయ్య, రోండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.