BREAKING
thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం
Date of Publish : 07 October 2026, 01:53 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఏపీలో బీసీ గురుకుల సిబ్బంది బదిలీలకు మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
07 Oct, 2026 - 01:53 PM
14 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. బీసీ గురుకులాల్లో సిబ్బంది బదిలీలకు సంబంధించి పలు నిబంధనలను ప్రభుత్వం ఖరారు చేసింది.

మార్గదర్శకాల ప్రకారం బాలికల గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష ఉద్యోగులను బాలుర గురుకులాలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. అలాగే బాలికల గురుకులాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, నాన్‌టీచింగ్ సిబ్బందికి కూడా బదిలీలు చేపట్టనుంది.

ఒకే విద్యాసంస్థలో కనీసం రెండేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అదే సమయంలో ఒకే విద్యాసంస్థలో ఎనిమిదేళ్ల సేవ పూర్తి చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది.

గురుకుల విద్యాసంస్థల్లో సిబ్బంది సేవలను సమతుల్యం చేయడం, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను సర్దుబాటు చేయడం, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం లక్ష్యంగా బదిలీల ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది.