బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్
తెలంగాణ
/
హన్మకొండ
హన్మకొండ: హన్మకొండ పరిధిలోని హసన్‌పర్తి, భీమారం, వడ్డేపల్లి చెరువుల్లో బతుకమ్మ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా చెరువుల వద్ద పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీరు, భద్రతతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
బతుకమ్మ నిమజ్జనం అనంతరం చెరువుల పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.