BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 08:36 am
Posted by : SEETHA KIRAN KUMAR

NH-65 విస్తరణకు టెండర్ ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
24 Sep, 2026 - 08:36 AM
16 వీక్షణలు

హైదరాబాద్–విజయవాడ: హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం మధ్య కీలకమైన జాతీయ రహదారి NH-65ను నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరించేందుకు చర్యలు ప్రారంభమైనట్లు సమాచారం.

ప్రతిపాదిత విస్తరణలో హైదరాబాద్ నుంచి నందిగామ వరకు సుమారు 181 కిలోమీటర్లు, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు సుమారు 59 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంటున్నారు.

ఈ పనులకు సంబంధించి NHAI టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. అయితే ప్రాజెక్టుకు ఎకనమిక్ అఫైర్స్ క్యాబినెట్ కమిటీ (CCEA) తుది ఆమోదం రావాల్సి ఉంది. ఆమోదం అనంతరం ప్రాజెక్టు అమలు ప్రక్రియ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ప్రతిపాదిత రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం.

NH-65 విస్తరణ పూర్తయితే హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం మధ్య రహదారి మౌలిక వసతులు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.