BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 12:06 pm
Posted by : K MAHESH

ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
08 Nov, 2026 - 12:06 PM
26 వీక్షణలు

ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్

అవినీతి నిర్మూలనే లక్ష్యం.. ప్రజా హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా – కోల మహేష్

ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న ఆర్టీఐ రక్షక్ సంస్థ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆర్టీఐ సతీష్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఆర్టీఐ ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారు. కోల మహేష్ అనుభవం, సేవలు సంస్థ బలోపేతానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

నూతన బాధ్యతలు స్వీకరించిన కోల మహేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్‌తో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతి మండలంలో యువతకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ పథకాలు, నిధుల వినియోగంపై ప్రజలకు సమాచారం అందించడం, అవినీతి, అక్రమాలపై చట్టబద్ధంగా పోరాటం చేయడం తన ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ అవినీతి నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

కోల మహేష్ నియామకంపై పలువురు జిల్లా కార్యవర్గ సభ్యులు, సంస్థ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.