BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 07:14 pm
Posted by : కూనురు మధు

నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం కాజేత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
08 Nov, 2026 - 07:14 PM
59 వీక్షణలు


– రిటైర్డ్ ఉద్యోగి విధుల్లో ఉండగానే మృతి చెందినట్లు తప్పుడు ధ్రువపత్రం సృష్టి


– రూ.13 లక్షలకు బేరం.. ఆధార్ చిరునామా మార్చి అక్రమంగా డెత్ సర్టిఫికెట్ జారీ


– మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, కుటుంబ సభ్యులు సహా 14 మంది అరెస్ట్


– రూ.5 లక్షల నగదు, కంప్యూటర్, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం


NTODAY NEWS: నల్లగొండ, 


 నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొందిన భారీ మోసాన్ని నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు 2025 మే 31న పదవీ విరమణ పొందారు. కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అదే ఏడాది నవంబర్ 17న మృతి చెందారు. అయితే ఆయన విధుల్లో ఉండగానే 2025 మే 28న మరణించినట్లు నకిలీ రికార్డులు సృష్టించి, కుమారుడికి కారుణ్య నియామకం కల్పించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు కొందరు కలిసి కుట్ర పన్నారు. ఈ వ్యవహారంలో డీఎంహెచ్‌వో కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగితో రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ముందుగా మీ సేవా కేంద్రం నిర్వాహకుడి సహకారంతో మృతుడి ఆధార్ కార్డులోని చిరునామాను నల్లగొండ పట్టణంలోని డీవీకే రోడ్డుకు మార్చారు. అనంతరం ఆ ఆధార్ ఆధారంగా విధుల్లో ఉండగానే మరణించినట్లు నల్లగొండ మున్సిపాలిటీ నుంచి తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం పొందారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా శాలిగౌరారం పీహెచ్‌సీ వైద్యాధికారి, డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది తప్పుడు విచారణ నివేదికలు రూపొందించి కారుణ్య నియామకానికి ఆమోదం తెలిపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మృతుడి కుమారుడు చామకూరి రాజుకు దామరచర్ల పీహెచ్‌సీలో ఉద్యోగం కల్పించారు. ఈ అక్రమ వ్యవహారంపై నల్లగొండ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి 14 మందిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుల నుంచి రూ.5 లక్షల నగదు, కంప్యూటర్, ప్రింటర్, 12 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ కె. శివరామిరెడ్డి పర్యవేక్షణలో నల్లగొండ వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహించారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ తెలిపారు.