BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 10:03 am
Posted by : K MAHESH

మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
08 Nov, 2026 - 10:03 AM
26 వీక్షణలు

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

భువనగిరి (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 8:

మేడారం దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగీర్‌పేట క్రాస్ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. భువనగిరి జిల్లా గౌస్‌పల్లికి చెందిన గణేష్, అమరేందర్, మహేష్, సాయి నలుగురు కలిసి ఆటోలో మేడారం దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా భాగీర్‌పేట క్రాస్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో రహదారిపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సాయి (28), అమరేందర్ (32) తీవ్రంగా గాయపడి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గణేష్, మహేష్ తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మేడారం దర్శనం చేసుకుని ఆనందంగా స్వగ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో గౌస్‌పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఇద్దరు మృతి చెందడం స్థానికులను కలచివేసింది.