BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 08:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో ఎంపీటీసీ అద్భుతరావుకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Nov, 2026 - 08:57 PM
5 వీక్షణలు

కూటమి నాయకుల ఆధ్వర్యంలో శాలువా కప్పి అభినందనలు..

విజయానికి ప్రజలే కారణమన్న అద్భుతరావు చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ ఎంపీటీసీ స్థానంలో కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధించిన తీర్దాల అబ్బుత రావును కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు. నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షుడు కందుల కృష్ణ, తల్లాడ శ్రీనివాసరావు, తేనేటి కిరణ్‌బాబు తదితర నాయకులు అద్భుతరావును కలిసి శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అద్భుతరావు మాట్లాడుతూ చనుబండ ఎంపీటీసీ ఎన్నికల్లో తన విజయానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని పేర్కొంటూ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం తన ఒక్కరిదే కాదని, చనుబండ గ్రామ ప్రజల విజయమని అన్నారు. కందుల కృష్ణ మాట్లాడుతూ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే ఐక్యత, సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను సమష్టి కృషితో సాధించాలని ఆకాంక్షించారు. తేనేటి కిరణ్‌బాబు మాట్లాడుతూ చనుబండలో కూటమి అభ్యర్థి సాధించిన ఘన విజయానికి కార్యకర్తల పట్టుదల, కృషి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈ విజయం కూటమి కుటుంబ సభ్యులందరిదని అభివర్ణించారు. తల్లాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన మద్దతుకు ఈ విజయం నిదర్శనమని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి దిశగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు మోదుగు ముత్తయ్య, కంచు గిరిరాజు, కల్లేపల్లి మహేశ్వరరావు, ఇసంపల్లి పూర్ణచంద్రరావు, కంచు శ్రీనివాసరావు తదితరులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.