BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 04:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ లో జనన, మరణాల ఆలస్య నమోదుకు కొత్త నిబంధనలు.. వాస్తవిక నిర్ధారణ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Nov, 2026 - 04:34 PM
41 వీక్షణలు

అమరావతి: జనన, మరణాల నమోదులో ఆలస్యాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏడాది నుంచి రెండేళ్లలోపు ఆలస్యంగా జనన, మరణాల నమోదు చేయించుకోవాలంటే సంబంధిత అధికారుల వాస్తవిక నిర్ధారణ ఉత్తర్వులు తప్పనిసరిగా ఉండాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో పేర్కొన్న నిబంధనలను అనుసరిస్తూ జనన, మరణాల నమోదు చట్టంలోని సెక్షన్‌-13లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం జనన, మరణాలు జరిగిన ఏడాది నుంచి రెండేళ్లలోపు నమోదు చేయించుకోవాలనుకునే వారు సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్, రెవెన్యూ డివిజనల్ అధికారి లేదా తహసీల్దార్ నుంచి వాస్తవిక నిర్ధారణ ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా రెండేళ్లకు మించి ఆలస్యంగా నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటే, సంబంధిత ప్రాంతంపై అధికార పరిధి కలిగిన ప్రథమ శ్రేణి న్యాయ మేజిస్ట్రేట్ వాస్తవికతను పరిశీలించి జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగానే నమోదు ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అవసరమైన ప్రాంతాల్లో చట్టప్రకారం నియమితులైన కార్యనిర్వాహక మేజిస్ట్రేట్లకు కూడా ఈ అధికారాలు కల్పించాలని జిల్లా కలెక్టర్లను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కొత్త నిబంధనలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్, నమోదు ప్రక్రియలో అవసరమైన మార్పులు చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ను ఆదేశించారు. ఈ మార్పులతో జనన, మరణాల ఆలస్య నమోదులో పారదర్శకత పెరగడంతో పాటు తప్పుడు ధ్రువీకరణలను అరికట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.