BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 09:04 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో టీడీపీ విజయ ఢంకా..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Nov, 2026 - 09:04 PM
6 వీక్షణలు

చంద్రబాబు, లోకేష్‌లకు విజయ కానుకగా స్థానిక సంస్థల ఫలితాలు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు

పుంగనూరు (ఎన్ టుడే న్యూస్): అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు తెలిపారు. పుంగనూరు మున్సిపాలిటీ విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ విజయాలను మంత్రి నారా లోకేష్‌కు కానుకగా అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఐదు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను టీడీపీ గెలుచుకోవడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసం ఉంచి టీడీపీకి మద్దతుగా నిలిచారని తెలిపారు. ఈ విజయం తమది కాదని, పార్టీ కార్యకర్తల విజయమని పేర్కొన్నారు.

గతంలో వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రజలకు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం లేకుండా ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియపై కూడా పలు విమర్శలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి తమకు నచ్చిన నాయకులను ఎన్నుకున్నారని తెలిపారు.

ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మధుసూదన్ నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో జరిగిన దాడిలో గాయపడిన తమ పార్టీకి చెందిన 25 మంది కార్యకర్తలకు అండగా నిలిచి, ఆర్థికంగా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఎంపీపీ అభ్యర్థిని ఎంపిక చేస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మధుసూదన్ నాయుడును ఘనంగా సన్మానించారు. మీడియా సమావేశంలో వివిధ పంచాయతీలకు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.