BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 02:33 pm
Posted by : K MAHESH

ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
08 Nov, 2026 - 02:33 PM
121 వీక్షణలు

సొంతింటి కల నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేసిన కుటుంబాలు

సంస్థాన్ నారాయణపురం (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మొదటి విడతలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల కుటుంబాలు తమ నూతన గృహాల్లో తొలిసారిగా దీపావళి పండుగను జరుపుకున్నాయి. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ పాలకవర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని కుటుంబాలతో కలిసి వేడుకల్లో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరిందని, తమ ఇంట్లోనే తొలిసారిగా దీపావళి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తమ కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసిందని తెలిపారు.

ఇళ్ల మంజూరు, నిర్మాణానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామికి, గ్రామ పాలకవర్గానికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సీహెచ్ నవీన్ కుమార్, మాజీ సర్పంచ్ కోన్‌రెడ్డి నర్సింహ, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్, వార్డు సభ్యులు పందుల యాదగిరి గౌడ్, సురపల్లి వెంకటేష్ నేత, సభావత్ రఘునాయక్, బలుగూరి శివసాగర్, సింగం బిక్షపతి, నీళ్ల అనిత శంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దుల మురళి యాదవ్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, పాల అంజయ్య, గుత్తా శేఖర్ రెడ్డి, రిపోర్టర్లు ఉప్పల వెంకటేష్, సింగం కృష్ణ, బద్దుల యాదగిరి యాదవ్, గడ్డం యాదయ్య, సుక్క రాములు, పెద్దగోని గిరి గౌడ్, బానోతు కిరణ్ నాయక్, గణేష్ నాయక్, గ్రామపంచాయతీ సిబ్బంది ముత్యాల చంద్రకాంత్, వడ్డేపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.