BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 04:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హనుమకొండలో అక్రమ మందుల నిల్వల గుట్టురట్టు..

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Nov, 2026 - 04:27 PM
25 వీక్షణలు

రూ.15 లక్షల విలువైన మందులు స్వాధీనం 

హనుమకొండ జిల్లా, నవంబర్ 8: హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో అక్రమంగా మందులు నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యవహారాన్ని అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండానే ఓ నివాస గృహంలో భారీ మొత్తంలో మందులు నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం ఔషధ విక్రయదారుల సంక్షేమ సంఘం నాయకులు అందించిన సమాచారం మేరకు ఔషధ నియంత్రణ విభాగం సహాయ సంచాలకురాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నివాస గృహంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.15 లక్షల విలువైన వివిధ రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా మందుల నిల్వలు, విక్రయాలు సాగిస్తున్న వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఔషధ తనిఖీ అధికారి జె. కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఈ వ్యవహారాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.