BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 12:15 pm
Posted by : KETHAVATH NITHIN

తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్

క్రీడలు క్రీడలు
Reporter
Kethavath Nithin NARSINGI MANDAL
08 Nov, 2026 - 12:15 PM
37 వీక్షణలు

200 మందికి పైగా క్రీడాకారుల హాజరు.. ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం

తూప్రాన్, నవంబర్ 7 (ఎన్ టుడే న్యూస్):

తూప్రాన్‌లోని సెయింట్ ఆర్నాల్డ్స్ పాఠశాలలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ ఘనంగా నిర్వహించారు.

ఈ ఎంపిక పోటీల్లో అండర్-14 బాలురు, బాలికలు, అండర్-17 బాలురు, బాలికల విభాగాల నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి ఎస్‌జీఎఫ్‌ఐ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, టీఎస్ పేట వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. నాగరాజు, పీఆర్‌టీయూ తూప్రాన్ ప్రధాన కార్యదర్శి ప్రణయ్, సెయింట్ ఆర్నాల్డ్స్ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ సమీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంపిక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి వేదికపై తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ ఎంపికలు అవకాశం కల్పిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ పీడీ ప్రవీణ్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనాథ్, రజిత, మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. 200 మందికి పైగా క్రీడాకారులు హాజరుకావడంతో ఎంపిక పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.