BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 07:33 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అమెరికాలో హిందువుల దీపావళి వేడుకల్లో గందరగోళం

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
08 Nov, 2026 - 07:33 PM
22 వీక్షణలు

సియాటిల్ సెంటర్ ఆర్మరీలోకి ప్రవేశించిన ఇద్దరు కన్జర్వేటివ్ యాక్టివిస్టులు

సియాటిల్ (ఎన్ టుడే న్యూస్): అమెరికాలోని సియాటిల్ సెంటర్ ఆర్మరీలో నిర్వహిస్తున్న హిందువుల దీపావళి వేడుకల్లో ఇద్దరు కన్జర్వేటివ్ యాక్టివిస్టులు చొరబడి గందరగోళం సృష్టించినట్లు సమాచారం. జేక్ లాంగ్, థామస్ అలెన్ అనే ఇద్దరు వ్యక్తులు భారతీయులను దేశం నుంచి పంపించాలంటూ అవమానకరమైన వ్యాఖ్యలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. క్రైస్తవుల స్థానంలో హిందువులు రావడాన్ని అడ్డుకోవాలంటూ మరో ప్లకార్డును కూడా ప్రదర్శించినట్లు సమాచారం.

అమెరికా సంస్కృతిని తప్పుడు దేవుళ్లను పూజించేవారు, హెచ్‌-1బీ వీసా మోసగాళ్లు ముంచెత్తుతున్నారనే ఆందోళనతోనే తాము ఈ నిరసన చేపట్టినట్లు వారు వెల్లడించినట్లు సమాచారం.

ఈ వారాంతంలో నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ నిరసనలు చేపడతామని వారు ప్రకటించారు. యాంటిఫా ప్రతీకార చర్యల భయంతో తదుపరి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెల్లడించబోమని పేర్కొన్నట్లు సమాచారం.

దీపావళి వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.