BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 10:30 am
Posted by : K MAHESH

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్

తెలంగాణ
/ నల్గొండ
Reporter
K Mahesh Munugodu Constituency
08 Nov, 2026 - 10:30 AM
22 వీక్షణలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.38 లక్షల దరఖాస్తులు.. యాదాద్రి జిల్లాలో 49,789 నమోదు

నల్లగొండ (ఎన్ టుడే న్యూస్):

వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియకు భారీ స్పందన లభిస్తోంది. పట్టభద్రులు పెద్ద సంఖ్యలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. నవంబర్ 7వ తేదీ మధ్యాహ్నం నాటికి నియోజకవర్గ పరిధిలో మొత్తం 6,70,367 దరఖాస్తులు అందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 2,38,304 దరఖాస్తులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా పరిశీలిస్తే నల్లగొండ జిల్లా అత్యధికంగా 1,14,525 దరఖాస్తులతో మొదటి స్థానంలో నిలిచింది. వీటిలో 59,163 దరఖాస్తులకు ఆమోదం లభించగా, మరో 52,810 దరఖాస్తులు పరిశీలనలో పెండింగ్‌లో ఉన్నాయి.

సూర్యాపేట జిల్లాలో 73,990 దరఖాస్తులు నమోదు కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 49,789 దరఖాస్తులు అందాయి. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ గణనీయమైన స్థాయిలో కొనసాగుతోంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఆసక్తితో అర్హులైన పట్టభద్రులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా అత్యధిక దరఖాస్తులతో ముందంజలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.