BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 07:28 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి.. గౌలిదొడ్డిలో విషాదం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
08 Nov, 2026 - 07:28 PM
19 వీక్షణలు

జయభేరి నిర్వాణ అపార్ట్‌మెంట్‌లో ఘటన.. మృతికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్): గౌలిదొడ్డిలోని జయభేరి నిర్వాణ అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. అపార్ట్‌మెంట్‌లోని సీ-బ్లాక్ ఏడో అంతస్తులో ఉన్న ఫ్లాట్ నంబర్ 702లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను బత్తుల మారెడ్డి (65), భారతి (60), నిశాంత్‌రెడ్డి (38)గా గుర్తించారు.

మృతుల్లో బత్తుల మారెడ్డి గతంలో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన కుమారుడు నిశాంత్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. నిశాంత్‌రెడ్డికి ఒక కుమారుడు ఉన్నట్లు తెలిసింది.

ప్రాథమిక పోలీసు విచారణలో భార్యాభర్తలు గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నట్లు వెల్లడైనట్లు సమాచారం. కుటుంబ సమస్యలు, అనారోగ్య కారణాలు ఈ ఘటనకు నేపథ్యమై ఉండవచ్చనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ముగ్గురి మృతికి అసలు కారణాలు ఇంకా స్పష్టంకాలేదు.

సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి మృతికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.