BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 04 August 2026, 07:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హిందూపురం ఘటనకు నిరసనగా తిరువూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Aug, 2026 - 07:19 PM
63 వీక్షణలు

హిందూపురం ఘటనకు నిరసనగా తిరువూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ

తిరువూరు, ఆగస్టు 4:

కృష్ణా జిల్లా న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.

జూలై 31న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని మాతృశ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ చేపట్టిన ధర్నా సందర్భంగా వన్‌టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు దురుసుగా ప్రవర్తించి, దూషించడమే కాకుండా బూటు కాలితో తన్నారని న్యాయవాదులు ఆరోపించారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన తిరువూరు న్యాయవాదులు, సంబంధిత సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయవాదులపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని, న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంకురాత్రి జనార్దన్ రావు, ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి కృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాదులు చింతల వెంకటరెడ్డి, మర్సకట్ల కుమార్, వాకధాని లక్ష్మీనారాయణ, మాకరాజు రామ్మోహన్, మునగాల అప్పారావు రాజు, అంకిరెడ్డి అంజనరెడ్డి, కొత్తపల్లి ఆనంద స్వరూప్, కోట జమలయ్య, చింతా బత్తిన రాజేంద్రబాబు, షేక్ గౌస్, ఎస్.కే. సుభాని, రావూరి నాగరాజు, కనపర్తి రాంబాబు, కారుమంచి సునీల్, భూక్య రామారావు, బండ్రపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.