కనకదుర్గ అమ్మవారికి చేనేత పట్టుచీర సమర్పణ
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
NTODAY NEWS చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం చేనేత పట్టుచీరను సమర్పించారు. చీరదాత చేపూరి శ్రీనివాస్–శోభ దంపతులు అందించిన పట్టుచీరను ముందుగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కోలాటాలు, భజన పాటలతో ఊరేగింపుగా కనకదుర్గ అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం ఆలయ చైర్మన్8 మారగోని ఆంజనేయులు గౌడ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా చీరదాత దంపతులను, మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, వైస్ చైర్‌పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులును సంఘం ప్రతినిధులు సన్మానించారు. పద్మశాలి కుల పెద్దలు, మహిళలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.