BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 30 April 2026, 06:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హోంగార్డ్స్‌కు ఘన వీడ్కోలు.. సేవలకు గౌరవ సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 06:14 PM
170 వీక్షణలు

హోంగార్డ్స్‌కు ఘన వీడ్కోలు.. సేవలకు గౌరవ సత్కారం

ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం (30-04-2026) హోంగార్డు యూనిట్‌లో దీర్ఘకాలంగా సేవలందించి పదవీ విరమణ పొందిన సభ్యులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ముఖ్య అతిథిగా హాజరై రిటైర్ అవుతున్న హోంగార్డ్స్‌ను పూలమాలలతో సత్కరించి శాలువాలు అందజేశారు. ఈ సందర్భంగా బొడిగడ్డ కోటేశ్వరరావు (హోంగార్డ్-145) 04-03-2003న నియామకం పొంది 17-04-2026న పదవీ విరమణ పొందగా, మొత్తం 23 సంవత్సరాలు 01 నెల 17 రోజులు సేవలందించారు. సదర్ల లక్ష్మీ పేరంటాలు (మహిళా కంపెనీ కమాండర్-190) 05-11-1994న నియామకం పొంది 30-04-2026న పదవీ విరమణ పొందుతూ 31 సంవత్సరాలు 11 నెలలు 19 రోజులు సేవలందించారు. వంగడపు సూర్యనారాయణ (హోంగార్డ్-50) 23-08-1998న నియామకం పొంది 09-03-2026న పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డ్స్ వ్యవస్థ పోలీసు శాఖకు వెన్నుదన్నుగా నిలుస్తుందని, విధి నిర్వహణలో వారు పోలీసు సిబ్బందితో సమానంగా కృషి చేసి ప్రజాసేవలో అమూల్యమైన సేవలు అందించారని కొనియాడారు. తమ సుదీర్ఘ సేవా కాలంలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ప్రశంసనీయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జీ మునిరాజా, డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఏఆర్ ఆర్‌ఐ పవన్ కుమార్, ఆర్‌ఎస్‌ఐ వెంకటేష్ పాల్గొన్నారు. రిటైర్ అయిన హోంగార్డ్స్, పోలీసు సిబ్బంది హాజరయ్యారు.