ప్రేమ వేధింపులు.. యువతి అనుమానాస్పద మృతి
తెలంగాణ
/
వికారాబాద్
వికారాబాద్ జిల్లా: పరిగి మండలం రావులపల్లిలో 18 ఏళ్ల శిరీష మృతదేహం వ్యవసాయ బావిలో లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ప్రేమ పేరుతో చరణ్ తన కుమార్తెను వేధించేవాడని శిరీష కుటుంబ సభ్యులు ఆరోపించారు. యువతి ముఖంపై రక్తగాయాలు ఉండటంతో, ఆమెను హత్య చేసి బావిలో పడేసి ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ అనంతరం మరణానికి గల కారణాలపై స్పష్టత రానుంది.