BREAKING
thumb ● బాలికలు మహిళలపై వేధింపులు నెలలో 38 మంది అరెస్ట్ thumb ● అగ్నివీర్ సర్వీసు కాలం పెంపునకు కేంద్రం యోచన thumb ● ఒకే రోజు 5 లక్షల మందికి ఉపాధి హామీ పనులు thumb ● తెలంగాణలో ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు thumb ● డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి thumb ● నీటి ఎద్దడి ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌లో ముందుగానే దీపావళి సెలవులు thumb ● చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు thumb ● బల్సుల భాగ్యమ్మ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● బాలికలు మహిళలపై వేధింపులు నెలలో 38 మంది అరెస్ట్ thumb ● అగ్నివీర్ సర్వీసు కాలం పెంపునకు కేంద్రం యోచన thumb ● ఒకే రోజు 5 లక్షల మందికి ఉపాధి హామీ పనులు thumb ● తెలంగాణలో ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు thumb ● డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి thumb ● నీటి ఎద్దడి ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌లో ముందుగానే దీపావళి సెలవులు thumb ● చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు thumb ● బల్సుల భాగ్యమ్మ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 09:26 am
Posted by : KOLA MAHESH

బాలికలు మహిళలపై వేధింపులు నెలలో 38 మంది అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
04 Nov, 2026 - 09:26 AM
19 వీక్షణలు

నల్గొండ జిల్లాలో షీ టీమ్స్ ప్రత్యేక నిఘా.. 492 సార్లు తనిఖీలు, 49 మందికి కౌన్సెలింగ్

నల్గొండ, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): మహిళలు, బాలికలపై వేధింపులను అరికట్టేందుకు నల్గొండ జిల్లా షీ టీమ్స్ ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాయి. అక్టోబర్ నెలలో వేధింపులకు పాల్పడిన 38 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల నుంచి 14 ఫిర్యాదులు స్వీకరించి, మూడు పెట్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

హాట్‌స్పాట్ ప్రాంతాల్లో 492 తనిఖీలు

మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యమిస్తూ జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలపై షీ టీమ్స్ ప్రత్యేక దృష్టి సారించాయి. అక్టోబర్ నెలలో హాట్‌స్పాట్ ప్రాంతాల్లో మొత్తం 492 సార్లు తనిఖీలు నిర్వహించారు. వేధింపులకు పాల్పడే వారిని గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

57 అవగాహన కార్యక్రమాలు

మహిళల భద్రత, చట్టపరమైన హక్కులు, వేధింపులపై ఫిర్యాదు చేసే విధానాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు 57 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సందర్భాల్లో 49 మందికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

వేధింపులు ఎదురైతే ఫిర్యాదు చేయాలి

మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. బాధితులకు అండగా నిలిచేందుకు షీ టీమ్స్ నిరంతరం అందుబాటులో ఉంటాయని తెలిపారు.