అనారోగ్యంతో మృతి చెందిన సభ్యుడి కుటుంబానికి తాపీ మేస్త్రీ సంఘం ఆర్థిక సాయం
లక్షెట్టిపేట తాపీ మేస్త్రీ సంఘం ఆధ్వర్యంలో సహాయం.. కుటుంబ సభ్యులకు నాయకుల పరామర్శ
లక్షెట్టిపేట, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఉత్కూర్ గ్రామానికి చెందిన దాసరి రామచందర్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి లక్షెట్టిపేట తాపీ మేస్త్రీ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు.
కుటుంబానికి సంఘం అండ
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన సంఘం నాయకులు, సంఘం తరఫున ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆపద సమయంలో సభ్యుల కుటుంబాలకు అండగా నిలవడం సంఘం బాధ్యతగా భావిస్తున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
పాల్గొన్న సంఘం నాయకులు
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బైరి రమేష్, కార్యదర్శి గజరాల తిరుపతి, ఉపాధ్యక్షుడు వేల్పుల శంకర్, సహాయ కార్యదర్శి శాతరాజు రమేష్, గౌరవ సలహాదారులు ఎండం రాజు, బిరుదుల తిరుపతి, పెండం రాజు, జంజిరాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.