విద్యార్థులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. హెడ్‌మాస్టర్ సస్పెండ్
తెలంగాణ
/
హన్మకొండ
హనుమకొండ: హనుమకొండ జిల్లా వడ్డేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్ లునావత్ నరేందర్ నాయక్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.
ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. గిరిరాజ్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత ఆరోపణలపై క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని డీఈవో వెల్లడించారు.
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆరోపణలపై తదుపరి విచారణ, శాఖాపరమైన చర్యలు కొనసాగనున్నాయి.