Hanmakonda: గ్రేటర్ వరంగల్‌లో భారీ వర్షం.. జలమయమైన రహదారులు
హంటర్ రోడ్డుపై చెరువులను తలపించిన వర్షపు నీరు.. వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు
హనుమకొండ, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):
గ్రేటర్ వరంగల్ మహానగరంలో ఆదివారం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని ప్రభావితం చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు వర్షపు నీటితో జలమయమయ్యాయి. సుబేదారి, నక్కలగుట్ట, పబ్లిక్ గార్డెన్, నయీంనగర్, డబ్బాల్, భీమారం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
హంటర్ రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు
ముఖ్యంగా హనుమకొండలోని హంటర్ రోడ్డు ప్రాంతంలో భారీగా వర్షపు నీరు చేరడంతో రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు
రహదారులపై నీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాదచారులు రోడ్లు దాటేందుకు అవస్థలు పడ్డారు. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షాల సమయంలో నీరు నిలిచే ప్రాంతాల్లో అధికారులు తక్షణ చర్యలు చేపట్టి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని నగరవాసులు కోరుతున్నారు.