మోటమర్రి రైల్వే స్టేషన్‌లో రైలు ఢీకొని హోంగార్డు మృతి
డ్యూటీలో ఉండగా హోంగార్డు మృతి
మోటమర్రి రైల్వే స్టేషన్‌లో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని దుర్మరణం
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని మోటమర్రి రైల్వే స్టేషన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి విధుల్లో ఉన్న హోంగార్డు కటికల శ్రీనివాస్ రెడ్డి రైలు ఢీకొని మృతి చెందారు.
వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11.45 గంటల సమయంలో మోటమర్రి రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి మొదటి ప్లాట్‌ఫారం నుంచి రెండో ప్లాట్‌ఫారానికి వెళ్తుండగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.
మృతుడు శ్రీనివాస్ రెడ్డికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. విధుల్లో ఉండగానే ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.