ట్యాంక్‌బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ట్యాంక్‌బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని పీవీఆర్ మాల్‌లో సినిమా చూసిన అనంతరం కుటుంబ సభ్యులు చిన్నారి సరాక్షి (6)తో కలిసి ట్యాంక్‌బండ్‌కు వెళ్లారు. అనంతరం హుస్సేన్‌సాగర్ వైపు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో చిన్నారి సరాక్షి తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ఉన్న ఓ బంధువు కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు.
లారీ డ్రైవర్ అతివేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.