BREAKING
thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ
Test 4
Date of Publish : 19 November 2026, 11:14 am
Posted by : MUSUGU GOPI

వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ జాతీయం
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
19 Nov, 2026 - 11:14 AM
9 వీక్షణలు

డిసెంబర్ 20 నుంచి 29 వరకు 8.34 లక్షల మందికి దర్శనం.. సామాన్య భక్తులకు 92 శాతం ప్రాధాన్యత

తిరుమల (ఎన్ టుడే న్యూస్): తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు 8.34 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. మొత్తం దర్శనాల్లో సామాన్య భక్తులకు 92 శాతం ప్రాధాన్యత కల్పించనున్నట్లు వెల్లడించారు. బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించిన టీటీడీ సాధికారిక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అలిపిరి సమీపంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు రూ.2,750 కోట్లతో యాత్రికుల టౌన్‌షిప్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్, డిజైన్ల తయారీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ కానుకగా శాశ్వత ఉద్యోగులకు రూ.16,940, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.8,289 చొప్పున అందించనున్నారు. తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం అదనంగా 348 మంది సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపారు. శ్రీవారి నిత్య కైంకర్యాలకు అవసరమైన పాలు, నెయ్యి సమకూర్చుకునేందుకు 500 దేశీయ గోవుల కొనుగోలుకు రూ.7.50 కోట్లు మంజూరు చేశారు.

స్విమ్స్ ఆసుపత్రికి అదనంగా రూ.41.23 కోట్ల ప్రత్యేక గ్రాంటు మంజూరుకు, ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో మరో 20 బీఏఎంఎస్ సీట్ల పెంపునకు ఆమోదం తెలిపారు. శిల్పకళాశాలలో రూ.23 కోట్లతో 229 మంది విద్యార్థులకు సరిపడేలా హాస్టల్ నిర్మించనున్నారు.

అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు రూ.16.40 కోట్లు, శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారిమెట్టు వరకు రహదారి అభివృద్ధికి రూ.9.50 కోట్లు కేటాయించారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే సమగ్ర సంక్షేమ విధానం అమలుతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ ప్రతిపాదనలకు సాధికారిక మండలి ఆమోదం తెలిపింది.