BREAKING
thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి
Test 4
Date of Publish : 19 November 2026, 09:54 am
Posted by : K MAHESH

గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 09:54 AM
7 వీక్షణలు

అడ్డగూడూరు గురుకుల పాఠశాలలో ఘటన.. వంటమనిషిపై పోక్సో కేసు నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లా (ఎన్ టుడే న్యూస్): గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వంటమనిషి వెంకన్నపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, హైదరాబాద్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

విద్యార్థినుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పేర్కొంటూ పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీరాణిని సస్పెండ్ చేశారు. ఈ కేసులో ప్రిన్సిపాల్‌తో పాటు మెస్ అటెండర్, సబ్ కాంట్రాక్టర్, కాంట్రాక్టర్లను కూడా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం.

ఈ ఘటనతో గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల భద్రత, పర్యవేక్షణ వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.