నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ
నంద్యాల: నంద్యాల మార్కెట్ యార్డులో అర్హులైన 233 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. నంద్యాల అర్బన్ పరిధిలో 173 మంది, రూరల్ పరిధిలో 60 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఇళ్ల స్థలాల పట్టాలు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవంతో కూడిన అంశమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించి వారికి ప్రభుత్వ పథకాల ద్వారా అండగా నిలవాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్షకు తావులేకుండా అర్హత ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్నారు.
ఇళ్ల పట్టాలు పొందిన కుటుంబాలకు భవిష్యత్తులో గృహ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీస