అనంతారం శివారులో భారీ నాగుపాము.. స్థానికుల్లో కలకలం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
గీసుకొండ: గీసుకొండ మండలం అనంతారం గ్రామ శివారులో భారీ నాగుపాము కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దారిన వెళ్లే పలువురు పామును చూసి అప్రమత్తమయ్యారు.
చల్లటి వాతావరణం నేపథ్యంలో విషసర్పాలు జనావాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. గ్రామ పరిసరాల్లో పాములు సంచరించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇళ్ల చుట్టూ చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రాత్రి వేళల్లో బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని స్థానికులు సూచించారు.