BREAKING
thumb ● మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం thumb ● గోవింద్‌పేట్ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం thumb ● గోవింద్‌పేట్ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ...
మంచి మాట
Date of Publish : 29 October 2026, 04:44 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నా: కొండా సురేఖ

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
29 Oct, 2026 - 04:44 PM
8 వీక్షణలు

గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన

హైదరాబాద్, ఎన్ టుడే న్యూస్:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశానని, అయితే నిరాధారమైన వ్యాఖ్యలు చేయాల్సింది కాదని ఆమె పేర్కొన్నారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన కొండా సురేఖ, కేటీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే దురుద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు.

రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష నేతలను విమర్శించే సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేశానని కొండా సురేఖ తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అంగీకరిస్తూ, వాటిపై చింతిస్తున్నట్లు తెలిపారు.

కేటీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బాధ కలిగించాలనే ఉద్దేశం తనకు లేదని పేర్కొంటూ, గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

కొండా సురేఖ తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.