BREAKING
thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు
Date of Publish : 07 October 2026, 11:24 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మామూళ్లు ఇవ్వకపోతే రైడ్ చేస్తాం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Oct, 2026 - 11:24 AM
6 వీక్షణలు

హోటల్, బేకరీ నిర్వాహకులకు బెదిరింపు కాల్స్

చౌడేపల్లి, అన్నమయ్య జిల్లా: చౌడేపల్లి మండలంలో హోటళ్లు, బేకరీలు నిర్వహిస్తున్న కొంతమంది వ్యాపారులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అధికారుల పేర్లను ఉపయోగిస్తూ మామూళ్లు డిమాండ్ చేస్తున్నట్లు వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

వ్యాపారుల వివరాల ప్రకారం.. మదనపల్లెకు చెందిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పరిచయం చేసుకుంటూ కొంతమంది వ్యక్తులు ఫోన్ చేస్తున్నారని చెబుతున్నారు. ‘మామూళ్లు ఇస్తారా.. లేక రైడ్ చేయమంటారా?’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఒక నంబర్ నుంచి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతూ, మరో నంబర్‌కు ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపాలని కోరుతున్నట్లు బాధిత వ్యాపారులు చెబుతున్నారు. తమకు వచ్చిన కాల్స్‌కు సంబంధించిన వివరాలు, కాల్ రికార్డింగ్స్ తమ వద్ద ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.

అధికారుల పేర్లను ఉపయోగించి వ్యాపారులను భయపెట్టి డబ్బులు వసూలు చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో సమగ్ర విచారణ జరపాలని వ్యాపారులు కోరుతున్నారు. సంబంధిత ఫోన్ నంబర్లను పరిశీలించి కాల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి నిజానిజాలను వెల్లడించాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోటల్‌, బేకరీ నిర్వాహకులు కోరుతున్నారు. ఆరోపణలపై అధికారిక విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.