BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మురసు తుఫాను ప్రభావం.. విద్యుత్ సరఫరాకు ప్రత్యేక చర్యలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Nov, 2026 - 02:20 PM
4 వీక్షణలు

అంతరాయం ఏర్పడితే తక్షణమే పునరుద్ధరణకు ఏర్పాట్లు విద్యుత్ శాఖ ఏడీఈ అనురాధ

మధిర, నవంబర్ 4: మురసు తుఫాను నేపథ్యంలో మధిర సబ్‌డివిజన్ పరిధిలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు విద్యుత్ శాఖ మధిర సబ్‌డివిజన్ ఏడీఈ అనురాధ తెలిపారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో తుఫాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో మాటూరు సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ స్తంభాలపై చెట్లు పడటంతో కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి చెట్లను తొలగించి మరమ్మతులు చేపట్టడంతో రాత్రి 11 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు వివరించారు. తుఫాను ప్రభావంతో ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించేలా సిబ్బంది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మధిర, ఎర్రుపాలెం మండలాల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే సంబంధిత సెక్షన్ ఏఈ లేదా విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, వాటిని తాకే ప్రయత్నం చేయవద్దని ఏడీఈ అనురాధ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.