BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త
Date of Publish : 05 October 2026, 08:38 am
Posted by : SEETHA KIRAN KUMAR

హన్మకొండలో రాత్రివేళ లారీల రాకపోకలతో ఇబ్బందులు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Oct, 2026 - 08:38 AM
0 వీక్షణలు

హన్మకొండ: జిల్లా కేంద్రంలో రాత్రివేళ లారీల రాకపోకలు పెరగడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. లారీలు వరుసగా వేగంగా వెళ్తుండటంతో రహదారులు దాటేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

కొన్ని ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు 10 నుంచి 20 నిమిషాల వరకు వేచి ఉండాల్సి వస్తోందని స్థానికులు పేర్కొన్నారు. రాత్రి సమయంలో భారీ వాహనాలు వేగంగా ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు లారీల వేగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా డివైడర్ల వద్ద స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.

ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.