BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 09:21 pm
Posted by : KADARI RAMANA

ఇంద్రవెల్లి పంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి

తెలంగాణ
/ నిర్మల్
27 Oct, 2026 - 09:21 PM
18 వీక్షణలు

నిర్మల్‌ | ఎన్‌ టుడే న్యూస్‌:

ఈ నెల 30న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించనున్న టీఆర్‌ఎస్‌ పార్టీ పంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్దన్‌ పిలుపునిచ్చారు. మంగళవారం నిర్మల్‌ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అనే ఐదు ప్రధాన అంశాలతో కవితమ్మ ప్రజల ముందుకు వస్తున్నారని బోడ జనార్దన్‌ తెలిపారు. ఈ అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఆశించిన స్థాయిలో మేలు చేయలేకపోయిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రైతులు, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతోందని విమర్శించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందని, నిరుద్యోగులకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని బోడ జనార్దన్‌ ఆరోపించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ఆయా పార్టీల మధ్య వివాదాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా వ్యవహరిస్తోందని బోడ జనార్దన్‌ విమర్శించారు.

ఈ నెల 30న ఇంద్రవెల్లిలో నిర్వహించే పంచజన్య సంకల్ప సభకు నిర్మల్‌ జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సభకు సంబంధించిన గోడపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దూప్‌ సింగ్‌, నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు రాము, నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రప్రకాష్‌, పార్టీ నాయకులు శ్రీనివాస్‌ గౌడ్‌, నరేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.