మల్లేల గ్రామంలో ఎంఎస్ ఎంఈ పార్క్ పనుల పరిశీలన
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మండలం మల్లెల గ్రామంలో నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణ పనులను తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా పార్క్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన వారు సంబంధిత అధికారులను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, పూర్తయిన పనులు, తదుపరి చేపట్టాల్సిన నిర్మాణ దశలపై అధికారులతో చర్చించారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.