రేపు బొంగులూరు ప్రమిద కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో ఆత్మీయ సమ్మేళనం
కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలి
డీసీసీ అధికార ప్రతినిధి బైరక రమాకాంత్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగులూరు ప్రమిద కన్వెన్షన్ హాల్లో నవంబర్ 4న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు డీసీసీ అధికార ప్రతినిధి బైరక రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించారు.
కార్యకర్తల సమస్యలపై చర్చించేందుకు అవకాశం
ఈ సందర్భంగా రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండేలా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కార్యకర్తలు తమ కష్టసుఖాలను, సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కార మార్గాలపై చర్చించుకోవచ్చని పేర్కొన్నారు.
కార్యకర్తల ఆత్మగౌరవానికి ప్రాధాన్యం
కార్యకర్తల సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ఈ ఆత్మీయ సమ్మేళనం ప్రధాన ఉద్దేశమని రమాకాంత్ రెడ్డి తెలిపారు.
కావున ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Meta Keywords: Ibrahimpatnam Congress Meeting, Malreddy Rangareddy, Bairaka Ramakanth Reddy, Congress Atmeeya Sammelanam, Bonguluru, Telangana Congress, Ibrahimpatnam News