పాఠశాలలు, కళాశాలల్లో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ కమిటీలు ఏర్పాటు చేయాలి
విద్యార్థులు, యువతలో సేవాభావం, మానవతా విలువలు పెంపొందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
యాదాద్రి భువనగిరి జిల్లా, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
విద్యార్థులు, యువతలో సేవాభావం, మానవతా విలువలను పెంపొందించే లక్ష్యంతో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.
రెడ్‌క్రాస్ సేవలపై అవగాహన కల్పించాలి
మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అర్హులైన యువతను రక్తదానానికి ప్రోత్సహించాలని, రెడ్‌క్రాస్ ద్వారా అందించే సేవలు, నిర్వహించే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
రెడ్‌క్రాస్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.