జోగుళాంబ అమ్మవారి కల్యాణోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
తెలంగాణ
/
జోగులాంబ గద్వాల
/
అలంపూర్
హైదరాబాద్, అక్టోబర్ 9 (N Today News): ఈ నెల 16న అలంపూర్‌లో నిర్వహించనున్న శ్రీ జోగుళాంబ అమ్మవారి కల్యాణోత్సవానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని ఆలయ ప్రతినిధులు ఆహ్వానించారు.
ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హన్మంతరావు, గద్వాల సంస్థాన వారసుడు కృష్ణ రామభూపాల్, శ్రీ జోగుళాంబ అమ్మవారి దేవస్థానం ఈవో దీప్తి ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. కల్యాణోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని అందజేసి, వేడుకలకు హాజరు కావాలని కోరారు.