BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 07 October 2026, 10:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆపదలో జనసైనికుడికి జనసేన అండ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 10:37 PM
34 వీక్షణలు

చింతలపూడి: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న జనసైనికుడు డోలా నాగరాజుకు జనసేన నాయకులు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన జనసైనికుడు డోలా నాగరాజు పనికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి తీవ్ర గాయాలు కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రమాదం కారణంగా కొంతకాలంగా చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నాగరాజు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న చింతలపూడి మార్కెట్ యార్డు చైర్మన్, జనసేన మండల పార్టీ అధ్యక్షులు చీదరాల దుర్గాపార్వతి మధుబాబు గత ఆగస్టు 9న ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా నాగరాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం తాజాగా నాగరాజుకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేస్తున్న జనసైనికులు ఆపదలో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం జనసేన కుటుంబం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కోసన చంద్రబాబు, టీడీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, జగన్నాథం కుమార్, కురిసెట్టి శీను, వెన్న సత్యనారాయణ, ఆకుల మధుతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.