BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 26 May 2026, 04:53 pm
Posted by : V శ్రీనివాస్

​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం

తెలంగాణ
/ మంచిర్యాల / జన్నారం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 May, 2026 - 04:53 PM
158 వీక్షణలు

ఈదురు గాలుల ధాటికి ఎగిరిపోయిన ఇనుప రేకులు.. భారీగా ఆస్తి నష్టం

​ మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో మంగళవారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం, తీవ్రమైన ఈదురు గాలులు కలకలం సృష్టించాయి. ఈ అకాల వాతావరణ మార్పుల వల్ల స్థానిక ఎస్.కె. గార్డెన్ ఫంక్షన్ హాల్ పైకప్పు పూర్తిగా చిన్నాభిన్నమైంది. అతివేగంగా వీచిన గాలుల ధాటికి పైకప్పుకు సంబంధించిన ఇనుప రేకులు గాల్లోకి లేచి చుట్టుపక్కల ఎగిరిపడటంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. రేకులు ఎగిరిపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వర్షం, గాలుల ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో చెట్లు నేలకూలడం, విద్యుత్ వైర్లపై కొమ్మలు పడటంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభించింది. ప్రస్తుతం సంబంధిత అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు