BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 06:52 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Oct, 2026 - 06:52 PM
2 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు: పుంగనూరు పట్టణంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పట్టణంలోని 13వ వార్డు కుమ్మరవీధికి చెందిన వైసీపీ మోడిలియార్ అధ్యక్షులు, వారి అనుచరులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరినట్లు తెలిపారు.

పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వై. మధుసూదన్ నాయుడు సమక్షంలో కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై తాము టీడీపీలో చేరినట్లు కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకత్వానికి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

కుమ్మరవీధి 13వ వార్డులో పార్టీని మరింత బలోపేతం చేసేలా నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని మధుసూదన్ నాయుడు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, 13వ వార్డు నాయకులు, కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, వారి అనుచరులు పాల్గొన్నారు.