BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 27 May 2026, 08:32 am
Posted by : NTODAY NEWS

కలెక్టర్ హెచ్చరిక: 18 ఏళ్లు రాకముందే పెళ్లి చేస్తే కఠిన చర్యలు

తెలంగాణ
/ నల్గొండ
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
27 May, 2026 - 08:32 AM
177 వీక్షణలు

NTODAY NEWS నల్లగొండ బ్రేకింగ్:

బాల్య వివాహాల నిర్మూలనపై నల్లగొండ జిల్లా యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నల్లగొండలోని రెడ్ క్రాస్ భవనంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థినులతో కలిసి పాల్గొన్న ఆయన బాల్య వివాహాల వల్ల చిన్నారుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

“18 సంవత్సరాలు నిండకముందే బాలికలకు వివాహాలు జరిపించడం చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా, వారి విద్య, ఆరోగ్యం, భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుంది” అని కలెక్టర్ పేర్కొన్నారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికలు చదువుకు దూరమవుతూ, శారీరక మరియు మానసిక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

ప్రభుత్వం బాలికల చదువు, భద్రత, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

అలాగే బాల్య వివాహాలకు సహకరించిన తల్లిదండ్రులు, బంధువులు లేదా ఇతర వ్యక్తులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులతో బాల్య వివాహాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.

“బాల్య వివాహ రహిత తెలంగాణే నిజమైన అభివృద్ధికి నిదర్శనం. చిన్నారి నవ్వు కాపాడితేనే సమాజానికి మంచి భవిష్యత్తు ఉంటుంది” అని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పేర్కొన్నారు.