BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 05:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అటవీ భూముల క్లాసిఫికేషన్ మార్చి పేదలకు పట్టాలు ఇవ్వాలి కలపాల వెంకటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 05:53 PM
11 వీక్షణలు

చాట్రాయి, అక్టోబర్ 7: అటవీ భూముల క్లాసిఫికేషన్‌ను మార్చి, ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేదలను రీసర్వేలో చేర్చి పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ మహాసభల పిలుపులో భాగంగా చిత్తపూరు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కలపాలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయడం లేదన్నారు. సంబంధిత అధికారులను వివరణ కోరగా ఆయా భూములు అటవీ భూములుగా రికార్డుల్లో నమోదై ఉన్నాయని, క్లాసిఫికేషన్ మార్చిన తర్వాత పట్టాలు మంజూరు చేసే అవకాశం ఉందని చెబుతున్నారని తెలిపారు. అటవీ భూముల క్లాసిఫికేషన్‌ను మార్చి, వాస్తవంగా సాగు చేసుకుంటున్న పేదల భూములను రీసర్వేలో చేర్చి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. పెద్ద కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా అటవీ చట్టాల్లో మార్పులు చేస్తూ వేలాది ఎకరాల భూములను వారికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని, రోజువారీ కూలీ రూ.700కు పెంచాలని, ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు, అలవెన్సులు చెల్లించాలని, మూడు సెంట్ల ఇళ్ల స్థలాల పథకాన్ని అమలు చేయాలని కోరారు. బియ్యం, కందిపప్పు, కూరగాయల ధరలను నియంత్రించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఓటర్ల జాబితాలో తొలగించిన ఓట్లను తిరిగి చేర్చాలని, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ వివేక్ భరత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.

గ్రామాల్లో స్మశాన భూముల ఆక్రమణలను తొలగించాలని, మౌలిక వసతులు కల్పించాలని, ఎన్ఎస్పీ కాల్వపై వంతెన నిర్మించాలని, పశువైద్యశాలకు నూతన భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు, సిట్టిపాటి పుల్లారావు, కొండపాక రామకృష్ణచారి, కొత్తపల్లి రాంప్రసాద్, మాటూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.