BREAKING
thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు
Date of Publish : 09 October 2026, 08:11 pm
Posted by : PERUMALLA PRAVEEN KUMAR

బాలానగర్‌లో కాన్షీరాం వర్ధంతి వేడుకలు.. ఘనంగా నివాళులు

తెలంగాణ
09 Oct, 2026 - 08:11 PM
24 వీక్షణలు

బాలానగర్: బహుజన ఉద్యమ నిర్మాత, సామాజిక విప్లవకారుడు మాన్యవర్ కాన్షీరాం వర్ధంతి వేడుకలను బాలానగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, బహుజన నాయకులు, విద్యార్థులు కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. “యాచించే వాళ్లం కాదు.. శాసించే వాళ్లం కావాలి. మనం పాలించబడే వాళ్లం కాదు.. పాలించే వాళ్లం కావాలి” అనే నినాదం బహుజన ఉద్యమ స్ఫూర్తిని చాటుతుందని పేర్కొన్నారు. అధికారం లేని పోరాటం వృథా, పోరాటం లేని జీవితం వృథా అనే భావనతో బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా కాన్షీరాం కృషి చేశారని గుర్తుచేశారు.


భారత రాజకీయ వ్యవస్థలో మార్పుల కోసం, సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వ సాధన కోసం ఆయన పోరాడారని నాయకులు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా బహుజన ఉద్యమాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు.


ఈ కార్యక్రమంలో బాలానగర్ మండల అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షుడు చంద్రయ్య, అధ్యక్షుడు శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామచందర్, ఉపాధ్యక్షుడు నేరెళ్లపల్లి యాదయ్య, ప్రధాన కార్యదర్శి కొండకళ్ల విష్ణువర్ధన్, బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కళ్లెం శ్రీనివాస్, టీఆర్పీ పార్టీ రాష్ట్ర నాయకుడు గుల్ల శ్రీనివాస్, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు లక్ష్మణ్, రాజుతో పాటు పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.