BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 06:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోకిలంపాడులో టీడీపీ వర్గపోరు.. సమావేశంలోనే ఎంపీటీసీపై దాడి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 06:43 PM
41 వీక్షణలు

నామినేషన్ల ఉపసంహరణ వేళ భగ్గుమన్న విభేదాలు.. పరస్పర దాడులతో ఉద్రిక్తత ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరఫున రెండు వర్గాలకు చెందిన నాయకులు నామినేషన్లు దాఖలు చేయడంతో కొంతకాలంగా కొనసాగుతున్న ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఈ క్రమంలో నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా నిర్వహించిన సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేపథ్యంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దుబ్బాక వెంకటేశ్వర్లు గ్రామ నాయకులతో కలిసి పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీటీసీ కోమటి వెంకట రామారావు హాజరయ్యారు. సర్పంచ్ అభ్యర్థుల విషయంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. ఈ క్రమంలో చెన్ను సాంబశివరావు అనే వ్యక్తి ఎంపీటీసీ కోమటి వెంకట రామారావుపై దాడికి పాల్పడినట్లు సమాచారం. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎంపీటీసీ సోదరుడు కోమటి సింహాద్రి రాజుపైనా దాడి జరిగినట్లు తెలిసింది. గొడవను సద్దుమణిగించేందుకు ప్రయత్నించిన కోమటి నరసింహారావు కూడా దాడికి గురయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ప్రతిగా వెంకట రామారావు అనుచరులు చెన్ను సాంబశివరావుపై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు, గ్రామ నాయకుల సమక్షంలోనే సమావేశం కాస్తా ఘర్షణ వేదికగా మారడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో మొదలైన విభేదాలు చివరకు పరస్పర దాడులకు దారితీయడంతో కోకిలంపాడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల వేళ అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఈ పరిణామాలు గ్రామంలో తీవ్ర చర్చకు దారితీశాయి.