BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

క్రమశిక్షణకు మారుపేరు అడిషనల్ ఎస్పీ మేదర రాజారావుకు ఘన వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Aug, 2026 - 07:27 AM
35 వీక్షణలు

క్రమశిక్షణకు మారుపేరు అడిషనల్ ఎస్పీ మేదర రాజారావుకు ఘన వీడ్కోలు

పదవీ విరమణ వేడుకలో ప్రశంసల జల్లు.. ఒకే వేదికపై ముగ్గురు ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు, అభిమానులు

విజయవాడ నగర అడిషనల్ ఎస్పీగా సేవలందించిన మేదర రాజారావు పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ జిల్లాల నుంచి పోలీసు అధికారులు, పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై రాజారావుకు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెలుగుదేశం పాలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో పాటు 1989 బ్యాచ్‌కు చెందిన పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

రాజారావు సేవలను కొనియాడుతూ పలువురు వక్తలు ఆయనను క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావానికి ప్రతిరూపంగా అభివర్ణించారు. పోలీసు అధికారిగా మాత్రమే కాకుండా మంచి భర్తగా, మంచి తండ్రిగా, సమాజ శ్రేయస్సును కోరుకునే బాధ్యతగల పౌరుడిగా ఆయన నిలిచారని ప్రశంసించారు.

వేడుకలో రాజారావును గజమాలతో సత్కరించేందుకు ఏర్పాట్లు చేయగా, ఆ గౌరవం తనకు కాదని, తనను ఈ స్థాయికి తీర్చిదిద్దిన తల్లి ఈశ్వరమ్మకే చెందుతుందని ఆయన వినమ్రంగా ప్రకటించారు. అనంతరం వేదికపైకి తల్లిని ఆహ్వానించి, రాజారావు దంపతులు ఆమెకు గజమాల వేసి సత్కరించి ఆశీర్వాదాలు తీసుకోవడం సభలో భావోద్వేగ క్షణంగా నిలిచింది.

వర్ల రామయ్య మాట్లాడుతూ, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో అల్లుడిగా ఉన్నప్పటికీ రాజారావు తన విధి నిర్వహణలో ఎప్పుడూ రాజీ పడలేదన్నారు. విధి నిర్వహణలో ఎదురైన సవాళ్లను ఆధ్యాత్మిక చింతన, దైవ నామస్మరణ, ఓర్పుతో అధిగమించి అడిషనల్ ఎస్పీ స్థాయికి చేరుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.

1990లలో ఎస్‌ఐగా పనిచేసిన రోజుల్లో అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుని "అంకుశం రాజారావు"గా ప్రత్యేక గుర్తింపు పొందారని పలువురు గుర్తు చేశారు. అదే సమయంలో నేరాలకు పాల్పడిన అనేక మందికి మార్గనిర్దేశం చేసి వారిలో మార్పు తీసుకురావడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు. ఒకప్పుడు కేసులు ఎదుర్కొన్న కొందరు వ్యక్తులు సైతం రాజారావు తమ జీవితాలను మార్చారని సభలో వెల్లడించడం విశేషంగా నిలిచింది.

పదవీ విరమణ చేసిన పలువురు పోలీసు అధికారులు మాట్లాడుతూ, సాధారణంగా ప్రతి పదవీ విరమణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా, రాజారావు వంటి నిజాయితీ, క్రమశిక్షణ, ఆధ్యాత్మికత కలిగిన అధికారిని అభినందించేందుకు ప్రత్యేకంగా వచ్చామని తెలిపారు.

విజయవాడ పోలీసు చరిత్రలోనే అరుదుగా కనిపించే స్థాయిలో ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, సహచరులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఒకే వేదికపై చేరి రాజారావుకు ఘనంగా వీడ్కోలు పలకడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.